కృష్ణా జిల్లా కుంటముక్కల వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 22 మంది విద్యార్థులుండగా.. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. 22 మంది పిల్లలు క్షేమంగా ఉన్నారు.
జి కొండూరు రూట్లో ఉన్న వెల్లటూరు - కుంటముక్కల గ్రామాల విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని పాఠశాలకు బయలుదేరారు. కుంటముక్కల సమీపంలోని ఇటుకల బట్టీల వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక విద్యార్థికి స్వల్ప గాయాలైనట్లు స్పష్టం చేశారు. డ్రైవర్‌తో సహా.. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో.. పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ జీఎల్ఐ ఇన్సురెన్స్ పథకం వర్తింపు