ETV Bharat / state

సీట్లను భర్తీ చేసుకునేందుకు ప్రైవేటు కళాశాలల ప్రయత్నాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. అధికారులంతా వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. వీలైనంత వరకు పని ఉంటే తప్ప బయటకు రావొద్దంటూ సూచిస్తున్నారు. కానీ.. విజయవాడలోని కొన్ని ప్రైవేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు ఇదేం పట్టడం లేదు. ఈ ఏడాది ఎప్పుడు కళాశాలలు తెరుస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంటే.. కొత్తగా ప్రవేశాలను చేపట్టారు.

private colleges stated admissions in Vijayawada in this corona time

author img

By

Published : Jul 26, 2020, 1:05 PM IST

కృష్ణాజిల్లా విజయవాడలోని కొన్ని ప్రైవేట్ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు కరోనాను ఖాతరు చేయకుండా నేరుగా సీట్ల భర్తీకి చర్యలు చేపట్టారు. నేరుగా కళాశాలలకే విద్యార్థులు, తల్లిదండ్రులను రప్పిస్తూ ప్రవేశాలు జరుపుతున్నారు. తాజాగా కొన్ని కళాశాలలు సీట్లను సైతం భర్తీ చేసుకున్నాయి. ఒకరిని చూసి మరొకరన్నట్టుగా.. ప్రస్తుతం మిగతా కళాశాలలు తమ సీట్లను నింపే పనిని ఆరంభించాయి.

ఇంజినీరింగ్‌ కళాశాలలతో పోటీపడి సీట్లను భర్తీ చేసుకోవడం డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఏటా కష్టతరంగా మారుతోంది. చాలా కళాశాలల్లో కనీస స్థాయిలోనూ సీట్లు నిండటం లేదు. ఈ ఏడాది కరోనాతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. కళాశాలలు తెరిచినా విద్యార్థులు ఎంతమంది వస్తారో కూడా తెలియని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.

అందుకే.. ప్రస్తుతం సీట్ల భర్తీపై యాజమాన్యాలు దృష్టిసారించాయి. నిన్నమొన్నటి వరకు ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలలు తమ సీట్ల భర్తీ ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను సైతం ఆరంభించాయి.

  • తల్లిదండ్రుల్లో మొదలైన ఆందోళన..

జిల్లాలోని ప్రభుత్వ, కొన్ని ప్రధాన కళాశాలలు ప్రవేశాలను నిర్వహించటం లేదు. దీంతో వాటిలో చేరాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. కొన్ని కళాశాలలు ప్రవేశాలు జరపటం, వాటిలో విద్యార్థులు చేరిపోతుండటంతో తమ పిల్లల పరిస్థితి ఏంటనే ఆందోళన ప్రధానంగా తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.

ఇప్పటికే రెండు, మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి పలు కళాశాలలు ఏర్పాట్లు చేసుకున్నాయి. దీంతో మొదటి ఏడాది వారిని సైతం చేర్చుకుంటే.. వారికీ ఆన్‌లైన్‌లో తరగతులు బోధించొచ్చనే ప్రణాళికతో ప్రస్తుతం ప్రవేశాల కోసం కొన్ని కళాశాలలు ఉత్సాహం చూపిస్తున్నాయి.

ప్రస్తుతం విజయవాడ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి జరుగుతోంది. అసలే.. రవాణా సౌకర్యాలు లేవు. విజయవాడకు శివార్లలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి నగరంలోని డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. ఇది వైరస్‌ వ్యాప్తికి మరింత ఊతం ఇచ్చే చర్యగా మారనుంది.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.