కారాగారాలను నేరస్తుల పరివర్తనకు కేంద్రాలుగా మార్చేందుకు అధికారులు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు . దీంట్లో భాగంగానే ఖైదీలకు యోగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు . జైళ్ల శాఖ ఏడీజీ అహసన్ రెజా ఆధ్వర్యంలో విజయవాడ జిల్లా జైలులో యోగాసనాలపై అవగాహన కల్పించారు . ప్రణవ సంకల్ప యోగాసమితి ప్రతినిధి పతంజలి శ్రీనివాస్... ఖైదీలకు యోగాసనాలను నేర్పించారు .
ప్రాణాయామం , ధ్యానం , సూర్యనమస్కారాలు , చక్రాసనం లాంటి ఆసనాలు నిత్యం అభ్యసిస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందని యోగా నిపుణులు తెలిపారు . ఆవేశంలో నేరాలు చేసి కారాగారాలకు వచ్చిన ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని విజయవాడ జైలు సూపరింటెండ్ రఘు అన్నారు . ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు .
ఇదీ చదవండి: 'చట్ట ప్రకారం పనిచేయని పోలీసులపై చర్యలు తీసుకోమనటం తప్పా?'