విజయవాడ ఈడ్పుగల్లు కోవిడ్ సెంటర్ నుంచి హత్యకేసులో ముద్దాయి పరారయ్యాడు. నిందితుడు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్నాడు. కరోనా పాజిటివ్ రావటంతో ఈడ్పుగల్లు కోవిడ్ సెంటర్కు తరలించగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. నిందితుడు కరోనా బాధితుడు కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఆచూకీ తెలిస్తే తమకు తెలపాలని పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: వైద్యుల చొరవ.. కరోనా వైరస్ సోకిన గర్భిణీకి ప్రసవం