రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్.. బుధవారం ఉదయం 11 గంటల 30 నిముషాలకు ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి... ఆహ్వానితులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాజ్‌భవన్ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి, హై కోర్టు చీఫ్ జస్టిస్ వాహనాలకే అనుమతి ఉంటుందని చెప్పారు.
అతిథులకు నాలుగు రకాల పాస్‌లు ఇచ్చామన్న సీపీ ద్వారకా తిరుమలరావు... హైకోర్టు న్యాయమూర్తులకు ఎ-1, మంత్రులకు ఎ-2 పాస్‌లు జారీ చేసినట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీ పాస్‌లు జారీ చేసినట్లు చెప్పారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు సీ పాస్‌లు ఇచ్చామన్నారు. బుధవారం ఉదయం 10.45 లోగా ఆహ్వానితులు ప్రాంగణంలోనికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయా పాస్‌ల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించినట్లు చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి బ్యాటరీ కార్ల ద్వారా ఆహ్వానితులను వేదిక వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 461 మంది ఆహ్వానితులు హాజరవుతారని వివరించారు.
ఇదీ చదవండీ...