ETV Bharat / state

తల్లీబిడ్డ మృతి.. వైద్యులే కారణమని కుటుంబీకుల ఆందోళన - మైలవరంలో తల్లీబిడ్డ మృతి బంధువుల ఆందోళన

కృష్ణా జిల్లా మైలవరం మండలం జంగాలపల్లిలో నవశిశువు సహా తల్లి మృతిచెందిన ఘటనలో.. కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వారి మృతికి మైలవరం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో బంధువులు ధర్నా చేశారు.

pregnent and born child died relatives protest in mylavaram krishna district
మృతురాలి బంధువుల ఆందోళన
author img

By

Published : May 25, 2020, 8:02 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం జంగాలపల్లిలో నవ శిశువు సహా తల్లి మృతిచెందిన ఘటనలో.. కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈనెల 18న కంభంపాటి కుసుమ అనే మహిళ పురిటి నొప్పులతో మైలవరం ప్రభుత్వాసుపత్రిలో చేరి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. విజయవాడ తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యురాలు శిరీష సూచించారు.

తల్లీబిడ్డను విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా శిశువు మృతిచెందాడు. తల్లి చికిత్స పొందుతూ ఈనెల 22న చనిపోయింది. అయితే వారి మృతికి మైలవరం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ నేడు ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో బంధువులు ఆందోళన చేశారు.

మేం జాగ్రత్తలు తీసుకున్నాం

ఈ విషయమై వైద్యురాలు శిరీషను ప్రశ్నించగా.. తాము కుసుమ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. శిశువు బరువు తక్కువగా ఉన్న కారణంగానే.. తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం వెంటనే విజయవాడ పంపించామని చెప్పారు. ఎస్సై ఈశ్వరరావు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇవీ చదవండి:

అలా అనడం దాతలను అవమానించడమే: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.