ETV Bharat / state

కృష్ణాజిల్లాలో దారి దోపిడీ.. 11లక్షల విలువైన రొయ్యలు మాయం - కృష్ణా జిల్లాలో రొయ్యల దోపిడి తాజా వార్తలు

కృష్ణా జిల్లాలో గురువారం అర్థరాత్రి దాదాపు రూ.11 లక్షల విలువైన రొయ్యల దోపిడీ జరిగింది. భీమవరం నుంచి తమిళనాడుకు వెళ్తున్న వాహనంలో రొయ్యల దోపిడీ చేసి.. డ్రైవర్‌ చేతులు కట్టిపడేసి రొయ్యల ట్రేలు మార్చేశారు.

prawns (robber) thefted by unknown people at bheemavaram in krishna
దారి దోపిడి.. 11లక్షల రొయ్యలు మాయం
author img

By

Published : Jan 24, 2020, 10:43 PM IST

కృష్ణాజిల్లాలో దారి దోపిడీ.. 11లక్షల విలువైన రొయ్యలు మాయం

కృష్ణాజిల్లా పామర్రు పోలీస్​స్టేషన్ పరిధిలో గురువారం అర్థరాత్రి దాదాపు 11 లక్షల రూపాయల విలువైన రొయ్యల దోపిడీ జరిగింది. భీమవరం నుంచి తమిళనాడుకు వెళ్తున్న వాహనం నుంచి ఐదుగురు వ్యక్తులు రొయ్యల్ని దోపిడీ చేసినట్లు డ్రైవర్‌ తెలిపాడు. కొమరోలు వద్ద ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని ఆపడానికి యత్నిస్తే... తప్పించుకుని ముందుకెళ్లిన తనను... ఐదుగురు వ్యక్తులు వెంబడించి వాహనాన్ని ఆపారని తెలిపాడు. అనంతరం తన చేతులు కట్టేసి క్యాబిన్‌లో పడేశారని తెలిపాడు. పలు గ్రామాల మీదుగా వాహనాన్ని తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు... ఉయ్యూరు పరిధిలోని ముదునూరు రోడ్డు వద్ద రొయ్యల ట్రేలు మార్చారు. వాహనంలో పడి ఉన్న డ్రైవర్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో దోపిడీ వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

మనస్తాపంతో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.