ETV Bharat / state

ఉత్పత్తి ఎక్కువ..వినియోగం తక్కువ

author img

By

Published : Oct 3, 2020, 7:19 AM IST

జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని దాదాపు నిలిపివేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గింది. వ్యవసాయ సీజన్ ముగియడం, కరోనా ప్రభావంతో పరిశ్రమలు పూర్తిగా పని చేయకపోవటంతో విద్యుత్ వినియోగం తగ్గింది.

current consumption decreased
తగ్గిన విద్యుత్ వినియోగం

వాతావరణం చల్లబడింది. ఫ్యాన్లు, ఏసీల వాడకం తగ్గింది. దానికితోడు వ్యవసాయ సీజన్‌ కూడా ముగియటంతో విద్యుత్తు డిమాండ్‌ రోజురోజుకూ తగ్గుతోంది. కొవిడ్‌ కారణంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదు. ఇదికూడా డిమాండ్‌ తగ్గడానికి కారణమైంది. ఫలితంగా జెన్‌కో ప్లాంట్లలో విద్యుదుత్పత్తి దాదాపు నిలిచింది. అలాగే కేంద్రసంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) మేరకు తీసుకోవాల్సిన విద్యుత్తునూ డిస్కంలు తగ్గించాయి.

*రాష్ట్రంలో సెప్టెంబరు 25న 175 మి.యూ. విద్యుత్తు వినియోగం ఉంది. ఇప్పుడది 145 మి.యూ.కు పడిపోయింది. దీంతో జెన్‌కో పరిధిలోని 15 ప్లాంట్లలో 12 బ్యాక్‌డౌన్‌ (ఉత్పత్తి నిలిపివేత) చేశారు. 3ప్లాంట్ల నుంచే 1200మెగావాట్ల విద్యుత్తు వస్తోంది.

* కేంద్ర సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం ఏటా 19వేల మి.యూ. విద్యుత్తును డిస్కంలు తీసుకోవాలి. డిమాండ్‌ లేక.. 13 వేల మి.యూ.కు మించి తీసుకోలేకపోతున్నారు.

అయినా.. తప్పని కొనుగోళ్లు

డిమాండ్‌ ఇంత తగ్గినా.. పీక్‌లోడ్‌ సమయంలో సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తును కొనుగోలు చేయక తప్పడం లేదు. నిత్యం సాయంత్రం 6-10 మధ్య వినియోగం పెరుగుతోంది. దీనికి థర్మల్‌ ప్లాంటును వినియోగిస్తే ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది. అందుకే రోజుకు 10 వేల యూనిట్లను కొంటున్నారు. యూనిట్‌ ధర సగటున రూ.3.50లోపు ఉందని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ తెలిపారు.

బకాయిలతో డిస్కంల దిగాలు

విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తి సంస్థలకు 6 నెలలుగా రూ.15వేల కోట్ల చెల్లింపులను నిలిపేశాయి. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్తు వినియోగం తగ్గటం, ఆశించినంత వసూళ్లు లేకపోవడంతో డిస్కంలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. పీపీఏల ప్రకారం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనే విద్యుత్తుకు ప్రతినెలా సగటున రూ.600 కోట్లు చెల్లించాలి.

కేంద్రసంస్థల నుంచి కొనేదానికి నెలకు సగటున రూ.700 కోట్లు చెల్లించాలి. జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల నుంచి ఏటా 22 వేల మి.యూ, హైడల్‌ విద్యుత్తు 3 వేల మి.యూ. తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. వీటికి ప్రతి నెలా రూ.1,200 కోట్లు చెల్లించాలి. కరోనా ప్రభావంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగాలు 30%, 40% తగ్గాయి. సెప్టెంబరుకు ఇది కొంత మెరుగైంది. హెచ్‌టీ వాణిజ్య విద్యుత్తు వినియోగం మార్చిలో 131.77 మి.యూ. ఉంటే, ప్రస్తుతం 97.39 మి.యూ.కు తగ్గింది. పారిశ్రామిక వినియోగం కూడా బాగా తగ్గింది. అన్ని కేటగిరీలకు కలిపి మార్చిలో 5,076 మి.యూ. ఉంటే ఇప్పుడు 4323 మి.యూ. ఉంది.

ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.