ETV Bharat / state

గుడ్డు తెచ్చిన కష్టం.. ఉత్తరాది వ్యాపారులతో నష్టపోతున్న రాష్ట్ర పౌల్ట్రీ రంగం

author img

By

Published : Feb 18, 2023, 8:21 PM IST

POULTRY INDUSTRIES PROBLEMS: ప్రభుత్వ సహకారం కొరవడటంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ట్రేడర్స్‌ గుత్తాధిపత్యంతో.... రాష్ట్రంలోని కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి వ్యయం పెరిగడం ఆపైన విక్రయించుకునేందుకు సరైన ధర లభ్యం కాకపోవడంతో.... పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం అవుతోందని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల ట్రేడర్స్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పౌల్ట్రీ
POULTRY

POULTRY INDUSTRIES PROBLEMS : కోడిగుడ్డుకు సరైన ధర లభించక రాష్ట్రంలోని కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. గతంలో నెక్‌ సంస్థ నిర్ణయించిన ధర ఆధారంగా కోడిగుడ్లను విక్రయించేవారు. ఆ సంస్థ కోళ్ల పరిశ్రమ నిర్వహణకు అవుతోన్న ఖర్చు, పెట్టుబడి, మార్కెట్‌ పరిస్థితిని అంచనా వేసి గుడ్డుకు కనీస ధర నిర్ణయించేది. దాంతో అటు వినియోగదారులకు ఇటు నిర్వాహకులకు ఇబ్బంది లేకుండా ఉండేది.

ఐతే మూడేళ్ల నుంచి నెక్‌ నిర్ణయించిన ధరకు కాకుండా.. వేరే ధరకు విక్రయించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి అనేక మంది ఫౌల్ట్రీ వ్యాపారం చేసేవారంటున్న నిర్వాహకులు.. అక్కడి ప్రభుత్వాలతో పాటు స్థానిక వ్యాపారుల నిర్ణయాలతో క్రమంగా అక్కడ మనలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఫలింతంగా మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేసి రాష్ట్రంలోనే పరిశ్రమలను నిర్వహించడం ప్రారంభించారని వివరిస్తున్నారు.

తర్వాత ఉత్తరాది రాష్ట్రాల నుంచి అనేక మంది ట్రేడర్స్‌ ఏపీకి వచ్చి వ్యాపారం చేస్తున్నారని.... ఫలితంగా వారి సంఖ్య పెరిగి మనవాళ్ల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఉత్తరాది ట్రేడర్స్‌ గుత్తాధిపత్యం చెలాయిస్తూ నెక్‌ నిర్ణయించిన ధర కన్నా తక్కువకు గుడ్లు విక్రయించాలని అడుగుతున్నారని... దానివల్ల స్థానికంగా కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.

ఉత్తరాది ట్రేడర్స్‌తో పాటు పెట్టుబడి ఖర్చు పెరగడం, గుడ్లు నిల్వచేసుకునేందుకు సరైన వ్యవస్థ లేకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో.. పరిశ్రమ మనలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుని ఉత్తరాది గుత్తాధిపత్యాన్ని అరికట్టడంతో పాటు తమకు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నెక్ ప్రకటించిన రేటును కాకుండా సొంతంగా వారు రేటు నిర్ణయించి. ఇవాళ గుడ్లు తీసుకెళ్లి వారం పది రోజుల తర్వాత కమింగ్ రేటని ఓ కొత్త విధానం పెట్టి చాలా నష్టానికి గురి చేస్తున్నారు ఈ కోళ్ల పరిశ్రమని. ముడి సరుకుల ధరలు కూడ గత సంవత్సరానికి ఇప్పటికి 75 శాతం పెరిగింది. ఉత్పత్తి ఖర్చే సుమారు 4 రూపాయల 80 పైసలుంటే కాని ఈ కోళ్ల వ్యాపారం నడపలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 4 రూపాయలు లేదా 4 రూపాయల 10 పైసలు ఇస్తూ ఈ రేటును కూడ 4 రోజుల తర్వాత చెప్తామని గుడ్లు పట్టుకెళ్తున్నారు. పచ్చి సరుకు కావడం వల్ల వాళ్ల చేతుల్లో ఇరుక్కు పోయాం. అలాగే లోకల్ సేల్​లో 30శాతం వినియోగం పెరిగింది. -దుర్గా నాగేశ్వరరావు, కోళ్ల ఫారం రైతు, కూచిపూడి

పౌల్ట్రీ పరిశ్రమల సమస్యలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.