ETV Bharat / state

Polycet : భవిష్యత్​కు బాట..! ఈ నెల 30 వరకు పాలిసెట్ దరఖాస్తు గడువు.. మే 10న పరీక్ష - పాలిసెట్ 2023

Polytechnic Entrance : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ -2023 మే 10న జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నరకు పైగా విద్యార్థులు పోటీ పడుతున్న ఈ పరీక్ష కోసం అధికారులు 410 కేంద్రాలను సిద్ధం చేశారు. ఎంపికైన విద్యార్థులకు 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు. ఈ సంవత్సరం బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లులోని కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కమిషనర్ నాగరాణి తెలిపాచు

Polytechnic College
Polytechnic College
author img

By

Published : Apr 21, 2023, 11:25 AM IST

Polytechnic Entrance : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ – 2023 ప్రవేశ పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 24 నుంచి కొత్త బ్యాచ్ కు అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పాలిటెక్నిక్ విద్య, ఉపాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 30 తుది గడువుగా పేర్కొన్నారు. పిన్న వయస్సులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి పాలిటెక్నిక్ విద్య ఓ మంచి మార్గంగా నాగరాణి తెలిపారు.

Polytechnic College

మే 10న ప్రవేశ పరీక్ష.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాల్లోని 410 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ 2023 నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ పరీక్షకు లక్షన్నర మంది విద్యార్థులు హాజరవుతారని అన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు పదో తరగతి సిలబస్ నుంచి గణిత శాస్త్రం 50 మార్కులు, భౌతిక శాస్త్రం 40 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల కాల నిర్దేశములో పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 176 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.

బాలికలకు ప్రత్యేకం.. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం ప్రత్యేకంగా 10 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, 2 మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభ్యున్నతి కోసం మరో 9 ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ లను ఉచిత వసతి, బోజన సదుపాయాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అర్హులైన ప్రతి విద్యార్ధిని ఏడాదికి రూ.50,000 చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్ షిప్ లభిస్తుందన్నారు. పాలిసెట్-2023 ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. 24 రకాల కోర్సులలో చివరి సంవత్సరం విద్యార్థులందరికీ ఆరు నెలలపాటు ఆయా సంస్థల్లో పారిశ్రామిక శిక్షణ ఇప్పించటం ద్వారా ఉత్తమ నైపుణ్యాభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామన్నారు.

2023- 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కోరుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష మే 10న రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. దాదాపు లక్షా 50వేల మంది విద్యార్థులు ఎంట్రెన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మేరకు ఇప్పటికే ఫ్రీ కోచింగ్ క్యాంపులు, 84 కశాశాలల్లో ప్రభుత్వ అధ్యాపకుల ద్వారా 10వేల మంది విద్యార్థులు శిక్షణ తీసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 30 ఇంజినీరింగ్ కోర్సులు ఎంచుకునే వీలుంటుంది. పూర్తి చేసిన వారికి చిన్న వయస్సులోనే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. - చదలవాడ నాగరాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.