ETV Bharat / state

నందిగామ పురపోరుకు అధికారుల ఏర్పాట్లు - municipal elections arrangements in krishna

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా నందిగామ నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర పరిశీలించారు. 20 వార్డులకు సంబంధించిన 40 పోలింగ్ బూత్‌ల సామగ్రిని సిబ్బందికి అధికారులు అందజేశారు.

Polling arrangements in nandhigama Krishna district
నందిగామ పురపోరుకు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
author img

By

Published : Mar 9, 2021, 6:18 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎన్నికల సామగ్రిని నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బందికి అధికారులు అందజేశారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 20 వార్డుల్లో జరిగే పురపోరుకు 40 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందుకుగాను 243 మంది సిబ్బంది పోలింగ్ విధులను నిర్వర్తించనున్నారు. కేంద్రాల వద్దకు చేరుకున్న ఉద్యోగులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

అంతకుముందు నందిగామ నగర పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా 20 వార్డులకు గానూ 40 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని అన్నారు. వీటిలో 35 అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్​లను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగులపై చర్యలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కమిషనర్​ను ఆదేశించారు. పోలింగ్ కేద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్‌ ఇంతియాజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.