ETV Bharat / state

బడ్జెట్​పై రాజకీయ పక్షాలు, వ్యాపార వర్గాల సంతృప్తి.. కానీ.. - రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Central Budjet : కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలు, వ్యాపార వర్గాలు సంతృప్తి వ్యక్తంచేశాయి. దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గే అవకాశం ఉందని.. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

కేంద్ర బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్‌
author img

By

Published : Feb 2, 2023, 9:09 AM IST

కేంద్ర బడ్జెట్‌

Central Budjet : కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలు, వ్యాపార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గే అవకాశం ఉందని.. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, రైల్వేలకు నిధులు పెంచడం, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులకు రాయితీలు ప్రకటించడం శుభపరిణామమన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని.. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకుందని చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజనకు నిధులు పెంచారన్న బుగ్గన.. రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, ఐటీడీఏ,ఆక్వాకల్చర్ బెనిఫిట్స్ ఉపయోగపడతాయన్నారు. వేతన జీవులకు పన్ను మినహాయింపు రూ.7లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను టీడీపీ స్వాగతించింది. జాతీయ స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు ఆశాజనకంగా ఉన్నా.. సీఎం జగన్ వైఫల్యం కారణంగానే రాష్ట్రానికి ఆశించిన మేర మేలు జరగలేదని ఆ పార్టీ విమర్శించింది.

కేంద్ర బడ్జెట్‌పై పారిశ్రామికవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బడ్జెట్‌లో ఊతమిచ్చారన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఉత్పాదకత పెరుగుతుందని.. పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమని వైద్యవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

బడ్జెట్‌పై కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. స్తిరాస్థి రంగానికి ఉపయోగపడేలా ప్రతిపాదనలు ఏవీ లేవని నెరెడ్కో విమర్శించింది. వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇస్తే... రియల్ రంగం పురోగతి సాధిస్తుందని అభిప్రాయపడింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.