ETV Bharat / state

మొక్కలు నాటుదాం.. వాటిని పరిరక్షిద్దాం: మంత్రి వెల్లంపల్లి - trees

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కేతనకొండలో.. పోలీసు సిబ్బంది వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

సామాజిక బాధ్యతతో మొక్కలు నాటిన పోలీసులు
author img

By

Published : Jul 5, 2019, 3:15 PM IST

సామాజిక బాధ్యతతో మొక్కలు నాటిన పోలీసులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కేతనకొండలో.. పోలీసు సిబ్బంది వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2 వేల మొక్కలు నాటారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు.. విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు హాజరయ్యారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి పెంపకం బాధ్యతనూ తీసుకున్న పోలీసులను అభినందించిన మంత్రి వెల్లంపల్లితో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.

సామాజిక బాధ్యతతో మొక్కలు నాటిన పోలీసులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కేతనకొండలో.. పోలీసు సిబ్బంది వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2 వేల మొక్కలు నాటారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు.. విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు హాజరయ్యారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి పెంపకం బాధ్యతనూ తీసుకున్న పోలీసులను అభినందించిన మంత్రి వెల్లంపల్లితో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.

Intro:ద్వారకాతిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు మార్గంమధ్యలో సౌకర్యాలు కల్పిస్తానని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ద్వారకా తిరుమల చిన వెంకన్నను ఆయన శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు .అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు .


Body:రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం ద్వారకాతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు .ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు .అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు సేవ చేసుకునే అవకాశాన్ని స్వామి వారు తనకు కల్పించారని ఆయన అన్నారు. దీనిలో భాగంగా అన్నదానం నిర్వహణకు తనవంతు సాయం అందించినట్లు చెప్పారు. శని ,ఆదివారాలు భక్తులు పెద్దఎత్తున క్షేత్రానికి స్వామివారి దర్శనం కోసం కాలినడకన వస్తున్నారని చెప్పారు .ఈ సమయంలో భక్తులు ఆ సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు .అయితే స్వామివారి అనుగ్రహంతో కాలినడకన వచ్చే భక్తులకు కూడా మూడు ,నాలుగు కిలోమీటర్ల దూరం వ్యవధిలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి, తాగునీరు ,మరుగుదొడ్లు ,అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు .త్వరలోనే భీమడోలు నుంచి ద్వారకాతిరుమల తోబ చర్ల నుంచి ద్వారకాతిరుమల మార్గాల్లో ఈ సౌకర్యాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని తెలిపారు. 50 నుంచి 100 మంది భక్తులకు సరిపడా విధంగా ఒకే చోట తాగడానికి నీరు ,విశ్రాంతి తీసుకోవడానికి వసతి , స్నానాలకు అవసరమైన కుళాయిలు, భోజనాలు వంటి సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు .స్వామి వారి ఆశీస్సులతో తనకు మంత్రి పదవి దక్కిందని అన్నారు . గృహ నిర్మాణ శాఖ ద్వారా పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.


Conclusion:దర్శనానంతరం మంత్రి శ్రీ రంగనాథ రాజుకు వైకాపా నాయకులు కార్యకర్తలు శ్రీ వారి జ్ఞాపకం అందజేసి అభినందనలు తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.