కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన నంది విగ్రహం ధ్వంసం కేసును జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు.. మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి. జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో ఒక బృందం... క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండో బృందంగా, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మరో బృందంగా ఏర్పడి విచారణ మొదలుపెట్టారు. గతంలో వివిధ దేవాలయాల్లో చోరీ చేసిన నిందితులను ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన ఎవరైనా ఆకతాయిగా చేసిందా..? మరే ఇతర కారణాల వల్ల చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు