కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు తెల్లవారుజామున పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. మునుకుళ్ల గ్రామం పొలిమేరల్లో ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై 400 అక్రమ మద్యం బాటిళ్లను తెలంగాణ నుంచి తరలిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో మైలవరం, పుల్లూరు గ్రామాల్లో వాహనాలను తనిఖీ చేసి అక్రమ మద్యం తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం1052 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పసిబిడ్డ కావాలంట.. భార్య వద్దంట..!