ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు.. గుట్కా, సారా, మద్యం పట్టివేత - మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నాటుసారా, అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్నారు.

police seized gutka  in the state
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గుట్కా, సారాయి పట్టివేత
author img

By

Published : Mar 1, 2021, 8:17 AM IST

గుట్కా స్వాధీనం

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో మయూరి థియేటర్ వెనుక ఒక కిరాణా దుకాణంలో పోలీసులు గుట్కాను పట్టుకున్నారు. అమ్మకాలు జోరుగా సాగుతున్నయన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు... సీఐ కనకరావు ఆధ్వర్యంలో ఎస్సై తాతాచార్యులు, ఇతర సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మూడు వేల రూపాయలు ఖరీదు చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌరీపురం చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ శేషగిరి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. 110 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పట్టుకుని.. మారెన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. పట్టణంలో నాగరాజు అనే వ్యక్తి వద్ద ఆరువేల రూపాయలు విలువ చేసే 2,950 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని రిమాండ్​కు తరలించారు.

నాటుసారా ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా మక్కువ మండలం వెంకటభైరిపురం గ్రామంలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఒక వ్యక్తి తన ఇంటి పెరడులో ఉన్న మరుగుదొడ్డిలో 1,500 నాటు సారాయి ప్యాకెట్లను దాచిపెట్టగా.. వాటిని పట్టుకున్నారు. ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో ఎస్​ఈబీ సీఐ దాసు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, సిబ్బంది రవికుమార్, గోవింద్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

కర్నూలు జేసీకి భూమా అఖిలప్రియ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.