తాను అప్పగించిన ధాన్యానికి రెండేళ్లకు పైగా నగదు చెల్లించడం లేదంటూ కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన సుబ్బరాజు అనే ధాన్యం వ్యాపారి... విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని పల్లవి రైస్‌మిల్లుపై ఫిర్యాదు ఇచ్చారు. ఈ పిర్యాదుపై జగయ్యపేట పోలీసులు సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. 30 మంది రైతులకు చెందిన రూ.3.5 కోట్ల ధాన్యం తాలూకూ బకాయిలను చెల్లించకుండా వాయిదాలు వేస్తూ మోసం చేస్తున్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ నిర్వహించిన సీఐ చంద్రశేఖర్.. మిల్లు యాజమాని విశ్వనాథాన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. బకాయి ఉన్న మాట వాస్తవమేనని తమ విచారణలో తేల్చిన పోలీసులు నిందితుడి వయసు రీత్యా సొంత పూచీకత్తుపై పంపి సోమవారం హాజరుకావాలని ఆదేశించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలిసి అదే మిల్లులో భారీ మొత్తంలో ధాన్యం విక్రయించిన వారిలో 30 మందికి పైగా రైతులు నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డిని కలిసి తమ గోడు వినిపించుకున్నారు. జగ్గయ్యపేట పట్టణ పోలీస్టేషన్లో నమోదైన కేసు విషయమై అన్నిరకాల విచారణ నిర్వహించి చట్టపంగా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి:
విజయవాడ రైల్వే స్టేషన్ యార్డులో భారీ మార్పులు.. తగ్గనున్న రైళ్ల నిరీక్షణ సమయం