కృష్ణా జిల్లా పేర్లవానిలంక గ్రామంలో కరోనాతో మృతి చెందిన ఓ యువతికి.. అవనిగడ్డ సీఐ బి. భీమేశ్వర్ రవికుమార్, నాగాయలంక ఎస్ఐ కుడిపూడి శ్రీనివాసు.. ఇతర పోలీస్‌సిబ్బంది కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. నాగాయలంకలో ఇస్త్రీ బండితో జీవనం సాగిస్తూ ఓ వ్యక్తి సోదరి కొవిడ్‌తో మరణించింది. ఆమె అంత్యక్రియలకు బంధువులెవరూ ముందుకు రాకపోవటంతో.. పోలీస్ సిబ్బంది, ఇతర సామాజిక కార్యకర్తలు నిర్వహించారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు శ్మశానవాటికకు చేరుకుని మానవతావాదుల సేవానిరతిని అభినందించారు.
ఇదీ చదవండీ.. అవార్డు సరే.. మరి స్వచ్ఛత ఏది?