కృష్ణా జిల్లా నందిగామలోని కేవీఆర్ కళాశాల విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలకు సిద్ధమవుతుండగా.. వారితో పోలీసులు చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు కాలేజీకి వచ్చి సందర్శిస్తారని నచ్చజెప్పారు. ఫలితంగా విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. నేటి సాయంత్రం వరకు సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. బుధవారం నాటి ఘటనను దృష్టిలో ఉంచుకుని కళాశాల వద్ద పోలీసులు మోహరించారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది.
ఇదీచదవండి.