స్థానిక ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున నగదు సరఫరా అవుతుంది. ఇటువంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కొణతమాత్మకూరు చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఎటువంటి బిల్లులు లేకుండా లక్షా 79 వేల నగదును ఓ ద్విచక్రవాహనదారుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు చేరవేస్తున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
కంచికర్లలో సామాన్య ప్రయాణికుడిలా:
కంచికర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో 45 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సామాన్య ప్రయాణికుడిలా భారీ మెుత్తంలో నగదను తరలిస్తున్న వ్యక్తి ఎటువంటి బిల్లులు చూపించకపోవటంతో కంచికర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: తలమంచిపట్నంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదు స్వాధీనం