ETV Bharat / state

మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కేసులు నమోదు - Minister Mallareddy Latest Comments

Police Case Filed on Minister Mallareddy: ఐటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదయింది. పలు సెక్షన్ల కింద బోయిన్​పల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతకుముందు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ అధికారి రత్నాకర్​పైనా కేసు నమోదయ్యింది.

Minister Mallareddy
మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Nov 24, 2022, 4:21 PM IST

Police Case Filed on Minister Mallareddy: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారుల పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఫిర్యాదుతో ఐటీ అధికారి రత్నాకర్‌పైనా కేసు నమోదయ్యింది. రెండు ఫిర్యాదులపై ఇప్పటికే బోయిన్‌పల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం నమోదు చేసిన జీరో ఎఫ్​ఐఆర్​ను బోయిన్‌పల్లి పోలీసులు దుండిగల్​ పోలీస్​స్టేషన్​కు బదిలీ చేశారు.

ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఈ విషయాన్ని ఐటీ వర్గాలు స్వయంగా వెల్లడించారు. సోదాలు పూర్తయ్యాక ఆయనకు సమన్లు జారీ చేసినట్లు తెలిపాయి. తనిఖీలు చేసిన ప్రతిసారి సమన్లు ఇవ్వడమనేది ప్రక్రియలో భాగమని చెప్పాయి. మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు వివరించాయి. పలు కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.

మల్లారెడ్డి, ఆయన కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బంధువులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు, కళాశాలలు, కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా నగదు, బంగారం, దస్త్రాలకు సంబంధించి అధికారులు మంత్రికి నోటీసులు ఇచ్చారు. వాటిపై వివరణ కోరారు.

మరోవైపు ఐటీ సోదాలపై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం, బీజేపీ కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమనే కాదు సీఎం కేసీఆర్‌ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండురోజుల పాటు మొత్తం కుటుంబాన్ని ఐటీ శాఖాధికారులు భయభ్రాంతులకు గురిచేశారని మంత్రి ఆరోపించారు. తనను మానసికంగా కుంగదీయడానికే సోదాలు నిర్వహించారని ఆయన ఆక్షేపించారు. ఇంతా చేసి ఐటీ అధికారులు పట్టుకుంది కేవలం రూ.28 లక్షలు మాత్రమేనన్నారు.

Mallareddy Reaction on IT Raids : ఐటీ దాడులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 2008లోనూ తమ ఇంట్లో తనిఖీలు చేశారని తెలిపారు. అప్పుడు సీజ్ చేసిన బంగారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని చెప్పారు. తామేం తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనన్న మంత్రి ఈసారి అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం బాధకరమన్నారు.

"నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్న విషయం తనిఖీలకు వచ్చిన అధికారులు చెప్పలేదు. కనీసం ఫోన్‌ చేసిన మాట్లాడించలేదు. నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నట్లు టీవీలో చూసి తెలుసుకున్నాను. సమాచారం టీవీలో చూసి నా భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. నా భార్య బాధ చూసి నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. కుమారుడిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లనీయకపోవడంతో కోపం వచ్చింది." అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Mallareddy comments on IT Raids : ఇప్పుడు జరుగుతున్న దాడుల ప్రక్రియ ఇంకా 3 నెలలు కొనసాగుతుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఏదైనా ఎదుర్కొనేందుకు కేసీఆర్ టీమ్ రెడీగా ఉందని చెప్పారు. ఎవరేం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా భవిష్యత్‌లో అధికారం బీఆర్ఎస్‌దేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.