ETV Bharat / state

నిడమర్రు... అన్ని గ్రామాలకు ఆదర్శం..! - police awareness programme news

కృష్ణా జిల్లా నిడమర్రు గ్రామంలో ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ అధికారి జిందాల్, ఎమ్మెల్యే... సారా తయారుచేస్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పోలీసులకు స్వచ్ఛందగా బట్టీలు అప్పజెప్పడం వల్ల తొలిసారిగా నిడమర్రు నుంచి మార్పు ప్రారంభమవటం శుభ పరిణామమని ఎస్పీ రవీంద్రనాధ్ బాబు కొనియాడారు.

police Awareness programme
నాటుసారా తయారీదారులకు అధికారుల అవగాహన
author img

By

Published : May 22, 2020, 4:14 PM IST

నాటుసారా తయారీ వృత్తిని వదిలేయాలని కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీలోని నాలుగు గ్రామాల వాసులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అధికంగా నాటుసారా తయారు చేస్తుండటంతో... ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ అధికారి జిందాల్, ఎమ్మేల్యేలు జోగి రమేష్, రాపాక వరప్రసాద్... జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

120 కుటుంబాలు నాటుసారా తయారీ చేయబోమని, 60 సారా బట్టీలను పోలీసులకు స్వచ్ఛందంగా అప్పగించారు. సారా తయారీని విడిచిపెట్టాలని ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు. కరోనా సమయంలో పోలీసులు అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. గ్రామాల్లోని చదువుకున్న యువత నాటుసారా లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి...

కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.