ETV Bharat / state

high court: ఆ భవనాన్ని ఖాళీ చేయించాల్సిందే.. హైకోర్టు ఆదేశాలు

ప్రభుత్వ సామాజిక భవనాల్లో చర్చీలు నిర్వహించటంపై హైకోర్టు(High Court)లో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సామాజిక కార్యక్రమాలకు నిర్మించిన భవనాల్లో.. ప్రార్థనాలయాలకు ఎలా అనుమతిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. జనవరి 8 లోపు భవనాన్ని ఖాళీ చేయించాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేసింది.

high court
high court
author img

By

Published : Nov 16, 2021, 8:32 AM IST

ప్రభుత్వ సామాజిక భవనాల్లో చర్చీలు నిర్వహించడంపై కృష్ణా జిల్లా(krishna district) ఈలప్రోలుకి చెందిన మెలం రమేష్.. హైకోర్టు(High Court)లో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరుఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ సామాజిక భవనాన్ని బలవంతంగా ఆక్రమించుకుని చర్చీ నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. స్పందించిన కోర్టు.. ఎస్సీ ప్రజల సామాజిక కార్యక్రమాలకోసం నిర్మించిన భవనాల్లో.. ప్రార్థనాలకు ఎలా అనుమతిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.

పిటిషనర్ తెలిపిన అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. జనవరి 8లోపు భవనాన్ని ఖాళీ చేయించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్​కు ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా కె.మన్మథరావు..సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.