ETV Bharat / state

పెరుగుతున్న పెట్రో ధరలు... విలవిల్లాడుతున్న సామన్యులు - ఏపీ పెట్రోలు ధర

అసలే కరోనా, ఆపై పెరిగిపోతున్న నిత్యవసర సరకుల ధరలు, అదనంగా వచ్చిచేరిన ఔషధ ఖర్చులు దరిమిలా... సగటు వేతనజీవుడి చేతిలో మిగులుతున్నది అరకొర జీతం మాత్రం. వీరి పరిస్థితే ఇలా ఉంటే... కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఈ సమయంలో పరిమితి లేకుండా పెంచేస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వినియోగదారుల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. వచ్చే ఆదాయంపైనే దృష్టి పెడుతున్న ప్రభుత్వాలు... ప్రజల ఇబ్బందులను లెక్కలోకి తీసుకోవడం లేదు. ఈ కారణంగానే అంతర్జాతీయ విపణికి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నా... దేశంలో మాత్రం ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు..

పెరుగుతున్న పెట్రో ధరలు....విలవిల్లాడుతున్న సామన్యులు

author img

By

Published : Jan 31, 2021, 3:14 PM IST

పెరుగుతున్న పెట్రో ధరలు

నెలంతా కష్టపడి చివర్లో వచ్చే కొద్దిపాటి జీతంతోనే కాలం వెళ్లదీస్తున్న చిరుద్యోగులు, సామాన్యులు ఎంతో మంది ఉన్నారు మనదేశంలో. వారందరికీ... ప్రతిరూపాయి ఎంతో విలువైనదే, ఆస్తులు కూడబెట్టేందుకు కాకపోయినా కనీస అవసరాలు తీర్చుకునేందుకు కచ్చితంగా పొదుపు చేసుకోవాల్సిందే. కానీ... ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో విలవిల్లాడుతున్నారు సామాన్యులు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితులు లేకుండా పెరిగిపోతున్న చమురు ధరలతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ వస్తువైనా.. కొనుగోలు, తరలింపు, లాభం ఆధారంగా అంతిమ ధర నిర్ణయానికి వస్తుంది. కానీ.. అదేం విచిత్రమో.... ఈ లెక్కలకు, సూత్రాలను అందని తీరుగా ఎడాపెడా పెరిగిపోతుంటాయి దేశంలోని చమురు ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ధరలు పెరిగినా, తగ్గినా... భారత్‌లో ధరలు మాత్రం కచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి తప్పా... ఎప్పటికీ తగ్గవు..

2015-16లో అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో పతనం నమోదయ్యింది. అప్పుడు దేశీయ చమురు ధరల్లో తగ్గుదల ఉండాల్సింది పోయి... పెరుగుదల నమోదయ్యింది. 2020లో కరోనా సమయంలోనూ ఇలాంటి పరిస్థితే చవిచూశారు దేశ వినియోగదారులు. కానీ... 2017లో ధరలు పెరిగినప్పుడు.. వాటికి అనుగుణంగా ధరలను అమాంతం పెంచేశాయి చమురు సంస్థలు. ఇలా...దిల్లీలోని పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రామాణికంగా చూస్తే... ఎటువంటి పన్నులు, వ్యాట్‌లు లేకుండా 2014 నాటికి పెట్రోల్‌ 47.12 రూపాయలకు లభించాలి. ఇదే.. లీటరు పెట్రోలు 2020 నాటి ధరలను అనుసరించి... 43 శాతం తగ్గుదల నమోదయ్యి 26.71 రూపాయలకు లభించాలి. కానీ వాస్తవంలో జరిగింది మాత్రం వేరు. బహిరంగ మార్కెట్లో.. అంటే ప్రభుత్వాల అన్ని రకాల పన్నులు ఈ కాలంలో 129 శాతం పెరిగాయి. అంటే... విపణిలో ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాల్ని వినియోగదారుకు దక్కకుండా.. మధ్యలోనే పన్నుల రూపేణా ఆ సొమ్మును తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఈ వైఖరితో... అంతర్జాతీయంగా మరే దేశంలో లేనన్ని పన్నుల భారాన్ని మోస్తున్నారు భారతీయులు. ఈ విధానాల కారణంగా.. దేశ పౌరులు సగటున వారి ఆదాయాల్లో 17 శాతానికి పైగా పెట్రోల్‌, డీజిల్‌పైనే వెచ్చిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి వివిధ అధ్యయనాలు..

ప్రస్తుతం దేశప్రజల కొనుగోలు సామర్థ్యం బాగా తగ్గిపోయింది. దాచుకున్న కొద్దిపాటి సొమ్ములు కొవిడ్‌ ఆంక్షల సమయంలో జీవనానికి, ఔషధాలకే పెద్ద మొత్తంలో ఖర్చయిపోయాయి.

ఈ కారణంగా.. ఆర్థికంగా చితికిపోయాయి అన్ని కుటుంబాలు. అలాంటి సమయంలో పెట్రోల్ ధరలను అమాంతంగా పెంచుతుండడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఒకవైపు ఉపాధి లేక, ఉద్యోగాలు కోల్పోయి, నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న తరుణంలో.... రోజూ పెట్రోలు ధరలను పెంచటం సరికాదంటున్నారు. మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ యజమానుల బాధలు వర్ణనాతీతం. చమురు ధరల పెరుగుదలతో ఖర్చులు పెరిగిపోయా యంటున్న వీరు... కరోనా సమయంలో నెలల తరబడి రోడ్లపైకి రాక, ఇప్పడు వచ్చినా ప్రయాణీకులు లేక నష్టాల బారినపడుతున్నామని వాపోతున్నారు. గతంతో పోలిస్తే 20నుంచి 30శాతం ఖర్చులు పెరిగాయని చెబుతున్నారు...Spot

కరోనా విజృంభణ సమయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయింది. దీంతో చాలా మంది ప్రజా రవాణాను వినియోగించేందుకు వెనకాడారు. ఈ కారణంగా.. చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను విపరీతంగా కొనుగోలు చేశారు. సాధారణంగా చేసే ఖర్చుతో పోల్చితే... వాటి నిర్వహణకు, ఇంధనానికి ఖర్చు అధికమవుతుందని తెలిసినా.. కొనుగోళ్లు కొనసాగించారు. ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోతున్న ధరలు.. వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రమాదంగా భావించిన ప్రజారవాణాకే మళ్లీ మొగ్గుచూపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రస్తుత కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు కాస్త తగ్గించాలన్న అభిప్రాయమే అంతటా వ్యక్తమవుతోంది. మరి...ఈ విజ్ఞప్తిని పాలకులు పట్టించుకుంటారా అన్నదే వేచి చూడాలి.

ఇదీ చదవండి

'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.