ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో చౌటపల్లి మోహనరావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘనట కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో జరిగింది. మాజీ సర్పంచ్ చౌటపల్లి మోహనరావు, సత్యవర్ధనరావు ఇద్దరు అన్నదమ్ములు. వారికి 70 సెంట్ల పొలం ఉంది. పంపకాల విషయంలో గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది.
ఇటీవలే ఈ వివాదం పెరిగి ఒకరినొకరు పరస్పరం దూషించుకున్నారు. ఈ ఘర్షణలో శరత్ బాబు కర్రతో దాడి చేయడం వల్ల అక్కడికక్కడే మోహనరావు కూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోహనరావును ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.
ఇదీ చదవండి: