ETV Bharat / state

సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు.. - మూలలంక గ్రామ సచివాలయ నిర్మాణ వాగ్వాదం

కృష్ణా జిల్లా మూలలంక గ్రామంలో సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆ స్థలంలో శివలింగాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో 11 మంది నిందితులుగా ఉండగా... నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.

people-who-set-up-fake-shivalingam-to-obstruct-the-construction-of-the-secretariat-in-krishna-district
సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు నకిలీ శివలింగం ఏర్పాటు
author img

By

Published : Oct 5, 2021, 10:22 AM IST

కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామ సచివాలయ నిర్మాణ స్థలంలో శివలింగం ఏర్పాటు కేసును పోలీసులు ఛేదించారు. ఆ స్థలంలో కావాలనే శివలింగం ఏర్పాటు చేసినట్లు సీఐ వై.వీ నాయుడు తెలిపారు. మండల తహసీల్దార్ సుబ్రహ్మణ్య శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా... గ్రామానికి చెందిన కొందరు సెప్టెంబర్ 20వ తేదీన చిలకలూరిపేటకు వెళ్లి ఓ శివలింగాన్ని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆన్​లైన్ ద్వారా 10 వేల 5 వందల రూపాయల నగదు చెల్లించినట్లు గుర్తించామని చెప్పారు.

గ్రామంలో ప్రతిపాదిత స్థలంలో సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు ఆ స్థలంలో శివలింగాన్ని పూడ్చి పెట్టి, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని సీఐ తెలియజేశారు. శివలింగం ఏర్పాటు కేసులో 11 మందిని నిందితులుగా గుర్తించామని... నలుగురిని అరెస్టు చేయగా మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: OBC PERCENTAGE IN AP: మన గ్రామాల్లో 45.8% ఓబీసీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.