ETV Bharat / state

పశువుల సంతలో కానరాని కరోనా నిబంధనలు... ఆందోళనలో ప్రజలు

ఓ వైపు కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుంటే... మరో పక్క కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. నందిగామ మార్కెట్​లో ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఏ ఒక్కరూ మాస్కు ధరించకపోగా .. ఒకే చోట గుంపులుగా చేరి విక్రయాలు కొనసాగిస్తుండడం.. ఆందోళనకరంగా ఉంది.

నందిగామ పశువుల సంత
నందిగామ పశువుల సంత
author img

By

Published : Apr 24, 2021, 6:24 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డులో ఆవరణలోని సంతలో వందలాది ప్రజలు ఒకే చోట చేరుతున్నారు. కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసినా... చాలామంది మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి శనివారం నందిగామలో పశువుల సంత నిర్వహింస్తుంటారు. ఇతర జిల్లాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

కరోనా రెండోదశ వ్యాప్తి చెందుతున్న సమయంలో అధికారులు కనీస చర్యలు చేపట్టకుండా... సంత నిర్వహించడం వలన కొవిడ్ వ్యాప్తి చెందే పరిస్థితి నెలకొంది. వ్యాపారులంతా ఒక చోటుకు చేరి విక్రయాలు నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఉల్లిపాలెం-భవానీపురం వారధికి అంబటి బ్రాహ్మణయ్య పేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.