కృష్ణా జిల్లా గన్నవరం, హనుమాన్ జంక్షన్లో ఏటీఎం సెంటర్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హనుమాన్ జంక్షన్‌లోని ని విజయవాడ , నూజివీడు, గుడివాడ , ఏలూరు రోడ్లలో ఎక్కడా ఏటీఎం పని చేయటం లేదని స్థానికులు తెలిపారు.
అదివారం కావటంతో ఉదయం నుంచి ఏటీఎంకి ఎక్కువ మంది వచ్చి వెనుదిరిగి వెళ్తున్నారు. మరో పున్నమ్మ కాంప్లెక్స్ వస్త్ర వ్యాపారికి పాజిటివ్ రావటంతో కాంప్లెక్స్ మూసివేసివేశారు. అందులోని యూనియన్ బ్యాంకు ఏటీఎం పనిచేయటం లేదు. బ్యాంకు అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నవరంలోని క్వారంటైన్, విమానాశ్రయం పరిసరాల్లో ఉన్న ఏటీఎంలు పనిచేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి జగన్‌ది ఇల్లా.. మాయా మహలా?... చిన్న పనులకు రూ. 4 కోట్లా?'