ETV Bharat / state

మనుషులు... మనసులు...మారిపోతున్నాయ్‌..!

ఎంత పనిచేశావే కరోనా....మానవత్వాన్ని మంటగలిపావ్..ప్రాణం మీద భయంతో బంధాలను తెంచేశావ్. కన్నవారిని బరువు అనుకులా చేశావ్. తోడబుట్టినవాడు పాజిటివ్ వచ్చి చనిపోతే కడసారి చూడ్డానికి రాకుండా చేస్తున్నావ్...రాష్ట్రంలో కరోనా సృష్టించిన సంఘటనలు ఇవి..పాజిటివ్ వచ్చి రోడ్డుపైనే కుప్పకూలిన ఓ వ్యక్తి మృతదేహానికి సాయం చేసేందుకు స్థానికులు సహా..బంధువులు కూడా రాలేదంటే అర్థమవుతోంది సమాజంలో మానవత్వం ఏ స్టేజ్ లో ఉందో.....

People are forgetting their responsibility over relationships because of the corona fear

author img

By

Published : Aug 3, 2020, 9:30 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో కరోనా పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే భయాందోళనకు గురై వైద్య సేవల కోసం బయలుదేరిన వ్యక్తి ఆయాసంతో రోడ్డుపై పడిపోతే సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బంధువులు, ఇరుగుపొరుగు వారు రాకపోవడంతో ఆరు గంటలు రోడ్డుపైనే మృతదేహం ఉండిపోయింది.

కృష్ణా జిల్లా నాగాయలంకలో వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చి చనిపోయారు. అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ఎవ్వరూ రాలేదు. పోలీసులు దగ్గరుండి అంతిమ సంస్కారాలు జరిపించారు. దీంతో వేదన చెందిన వ్యాపారి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కరోనా లేకపోయినా అంత్యక్రియలకు బంధువులు రాలేదు. దీంతో మరోసారి పోలీసులే ఆ కార్యక్రమం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

మనుషుల్లో...

రక్త సంబంధం..విడదీయలేనిది

బంధుత్వం..ఎన్నటికీ చెరిగిపోనిది

స్నేహబంధం..వెలకట్టలేనిది..!!

కరోనా...

అన్నీ బంధాలను మింగేస్తోంది

మానవత్వాన్ని మంటగలుపుతోంది

మానవీయ విలువలే లేకుండా చేస్తోంది..!!

మనం మారాలి...

కొవిడ్‌పై ఉన్న అపోహలు వీడాలి

స్వచ్ఛంద సంస్థలు చైతన్యం తేవాలి

అందరూ అన్ని జాగ్రత్తలు పాటించాలి

మానవీయ విలువలకు ప్రాణం పోయాలి

బాధితులకు అండగా నిలివాలి..!!

ఉద్యోగులే ఆత్మబంధువులై..:

కరోనా వేళ ఉద్యోగులే ఆత్మబంధువులుగా మారుతున్నారు. సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల మండలంలోని కొండబోట్లువారిపాలెం, మంగళగిరి, గుంటూరు నగరం, కృష్ణా జిల్లాలోని నాగాయలంకతోపాటు చాలా చోట్ల అందరూ ఉండి అనాథల్లా ఉండిపోయిన మృతదేహాలకు పోలీసులు, పంచాయతీ, పురపాలక సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.

అమరావతి పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మానవత్వం మంటగలిసే సంఘటనలు రోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. పాజిటివ్‌తో చనిపోయిన వారి చివరి చూపులకు వెళ్తే తాము బాధితులం అవుతామనే అనుమానాలు ఎక్కువ మందిలో ఉంటున్నాయి. ఒక దశలో ఇవి పెరిగి ఆరోగ్యవంతులు చనిపోయినా కడచూపుకు వెళ్లడం లేదు. బతికున్నంత వరకు కుటుంబం అభ్యున్నతి కోసం కష్టపడ్డ చాలా మంది చివరికి అందరూ ఉండి అనాథలా మట్టిలో కలసిపోతున్నారు.

బంధాలు ఇలా.. సమాజం అలా..

● నాదెండ్ల మండలంలోని అమీన్‌సాహెబ్‌పాలెంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా గ్రామస్థులతోపాటు మృతుడి భార్య స్వగ్రామమైన సాతులూరులోని బంధువులు, ఆప్తులు అంత్యక్రియలు చేసేందుకు ఇష్టత చూపించలేదు.కుమారుడు, కుమార్తె ఉన్నతస్థితిలో ఉన్నా పట్టించుకోని పరిస్థితి.

● సత్తెనపల్లి పట్టణంలోని నాగన్నకుంటలో మహిళ మృతి చెందగా చివరిచూపుకు ఎవరూ రాక భర్త అంత్యక్రియలు చేసుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నా శ్మశానవాటిక సమీపంలో నివసించే ప్రజలు ఏకంగా తాళం వేశారు.

● మంగళగిరికి వృద్ధురాలు బతికి ఉన్నప్పుడు స్థానికులు ఎంతో సాయం చేశారు. చివరకు ఆమె సాధారణంగా చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు.

ప్రజలు మానవీయ కోణంలో ఆలోచించాలి

ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పాజిటివ్‌తో మృతి చెందిన వ్యక్తి శరీరంలో వైరస్‌ 6 గంటలకు మించి ఉండదు. ఆ తరువాత కార్యక్రమాలు చేసుకోవచ్ఛు ప్రజలు ఆదిశగా ఆలోచన చేయటం లేదని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు. అమానవీయ కోణంలో ఆలోచిస్తున్నారు. మనకే ఆ పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏమిటీ..? అనే ఆలోచన చేయాలన్నారు. బాధితులకు ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి.

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మానవీయ విలువులు పరిమళించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి

మోహన్‌బాబు ఫాంహౌస్‌ ఘటనలో నిందితుల రిమాండ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.