ETV Bharat / state

లక్ష్మీపురంలో దుర్గాదేవి విగ్రహం తొలగింపు.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం

author img

By

Published : Oct 19, 2020, 2:24 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో దేవీనవరాత్రుల సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ... పోలీసులు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వివాదానికి దారితీసింది. విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలంటూ విశ్వహిందూ పరిషత్ శివస్వామిజీ... గ్రామస్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రమణమూర్తి... విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

people anger on cops for removal of Durgadevi idol in Lakshmipuram at krishna district
లక్ష్మీపురంలో దుర్గాదేవి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు... స్థానికుల ఆగ్రహం

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో దేవీనవరాత్రుల సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ... పోలీసులు దుర్గాదేవీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వివాదానికి దారితీసింది. మొదటిరోజు పూజలు నిర్వహించిన గ్రామస్థులు... రెండోరోజు పూజలు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ నిమజ్జనం చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ శివస్వామిజీ... లక్ష్మీపురంలో పర్యటించారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలంటూ గ్రామస్థులతో శిబిరంలో నిరసనకు దిగారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ రమణమూర్తి... విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

శ్రీశైలంకు కొనసాగుతున్న వరద...10 గేట్లు ఎత్తివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.