ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటపై దాడి జరిగిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటుచేసుకుంది. అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయిపై తీవ్రంగా దాడి చేసి... అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి చెందిన వేపూరి గోపి (23), అదే గ్రామానికి చెందిన భూపతి పూజిత (20) ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోని కారణంగా... గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, శుక్రవారం అన్నవరం గుడిలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి వస్తుండగా... పులిగడ్డ టోల్ గేట్ వద్ద అమ్మాయి బంధువులు సుమారు 50 మంది వరకు అడ్డగించి దాడి చేశారు. ఘటనపై.. పెళ్లి కొడుకు అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇవి చదవండి....48 అడుగుల్లోనే నీళ్లు- 11 జంటలకు పెళ్లిళ్లు