కృష్ణా జిల్లా నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని పేకాట రాయుళ్లు పరిపాలిస్తున్నారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని ఏ విధంగా పేకాట ఆడిస్తున్నారో.. పలు ప్రాంతాల్లోనూ అదే జరుగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పేకాట కొనసాగుతోందని ఆరోపించారు. తను కూడా పులివెందులకు చెందిన వాడిని కాబట్టి ఆ విషయం తనకు తెలుసన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతోందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల పై వరుసగా దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏ మాత్రం స్పందించి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం అవుతుందని తెలిపారు.
ఇవీ చూడండి...