ETV Bharat / state

అరెస్ట్​ చేస్తే తప్పు చేసినట్లయితే.. అది అందరికీ వర్తిస్తుంది: పయ్యావుల కేశవ్ - సీఐడీ విచారణ

Payyavula comments on skill development : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావు కేశవ్ అన్నారు. కేవలం ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికే స్కిల్ డెవలప్​మెంట్​పై సభలో చర్చించారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్​మెంట్​ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక బయట పెట్టాలని సవాల్ విసిరారు.

పయ్యావుల కేశవ్
పయ్యావుల కేశవ్
author img

By

Published : Mar 20, 2023, 8:08 PM IST

Payyavula comments on Skill Development : ఏమీ జరగని స్కిల్ డెవలప్​మెంట్​పై ఏదో జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. సభలో అసత్యాలు చెప్పారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ, ప్రేమ్ చంద్రా రెడ్డి, సెంట్రల్ టూల్ డిజైన్స్ సంస్థ తప్పు చేయకుండా చంద్రబాబే తప్పు చేశారా..? అని ప్రశ్నించారు. ఈడీ ఎంక్వైరీ చేస్తుండగా.., సీఐడీ ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది కాబట్టి తప్పేననే రీతిలో సీఎం కామెంట్లు చేశారని ఎద్దేవా చేశారు. అరెస్ట్ చేస్తేనే తప్పు చేసినట్టు అయితే.. ఈ రూల్ సీఎం జగనుకూ వర్తిస్తుందని ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం సీఐడీ విచారణలో ఏం తేల్చారని ప్రశ్నించారు.

ఓటమి భారం తప్పించుకునేందుకే.. కేవలం ఎమ్మెల్సీ ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికే స్కిల్ డెవలప్​మెంట్​పై సభలో చర్చించారని విమర్శించారు. దేశానికి క్విడ్ ప్రొకో.. షెల్ కంపెనీలు అనే పదాలను పరిచయం చేసింది జగనేనని దుయ్యబట్టారు. మళ్లీ అవే పదాలను సీఎం జగన్ మాట్లాడితే ఎలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అనుకున్న విధంగా ఈడీ విచారణలో తేలుతుందనే అనుమానం ప్రభుత్వానికి వచ్చి ఉంటుందన్నారు. అందుకే సమాంతరంగా సీఐడీ విచారణ చేపడుతోందని తెలిపారు. రెండు రోజుల పాటు సీమెన్స్ ఒప్పందంలో ఏదో జరిగిపోయిందని సభ సమయాన్ని దుర్వినియోగం చేసిందని ఆక్షేపించారు.

సంబంధం లేని అంశాలపై.. ఎక్కడో జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి జరుగుతోన్న విచారణకు రాష్ట్రానికి, చంద్రబాబుకు సీఎం జగన్ లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్​మెంట్​ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక బయట పెట్టండని సవాల్ చేశారు. ఏ అకౌంట్లకు డబ్బులు వెళ్లాయి.. ఏ పెద్దల ఖాతాలకు వెళ్లాయోననే వివరాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలేవీ తప్పు పట్టడం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లుగా స్కిల్ డెవలప్​మెంట్​ వెబ్​సైట్​లో వివరాలు ఉన్నాయి. సీమెన్స్ కంపెనీని విచారణకు పిలవండని కోరారు. సీమెన్స్ సంస్థ తమకు సంబంధం లేదంటూ ఇచ్చిన స్టేట్​మెంట్​ పట్టుకుని వేలాడుతున్నారు. సీమెన్స్ సంస్థకు డబ్బులు రిలీజ్ చేసింది ఘంటా సుబ్బారావో.. ఇంకొకరో కాదు.. ప్రేమ్ చంద్రారెడ్డి రిలీజ్ చేశారని తెలిపారు. కేవలం ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికే స్కిల్ డెవలప్​మెంట్​పై సభలో చర్చించారని పయ్యావుల పేర్కొన్నారు.

పయ్యావుల కేశవ్

అన్ని పర్ఫెక్ట్​గా ఉన్నాయి.. ఇక్కడేమీ జరగలేదన్నది అప్పట్లో విచారణ సంస్థ స్పష్టం చేసింది. ఇందులో తప్పులు జరిగాయని సీబీఐ ఏమైనా రాసిందా..? ఎక్కడో జీఎస్టీ చెల్లించలేదని జరుగుతున్న విచారణ పట్టుకుని.. ఇక్కడేదో జరిగిందని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. జీఎస్టీ చెల్లింపులు అనేవి సదరు కంపెనీకి సంబంధించిన అంశం. కానీ, ఈ రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని అంశాన్ని తెరమీదకు తీసుకురావడం మసిపూసి మారేడు కాయను చేయడమే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సంవత్సరం కిందట ఇచ్చిన నివేదికను బయటపెట్టండి. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఉద్దేశంతో మూడేళ్ల కిందట సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా ఇంత వరకు ఏమీ తేల్చలేదు.. కానీ, పత్రికలకు లీకులు ఇస్తూ అవాస్తవాలు రాయించారు. - పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.