ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పవన్ అభిమానుల సందడి - vakeelsaab movie latest news

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా సందర్భంగా ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. పెద్ద ఎత్తున్న అభిమానులు వెళ్లడంతో... రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడింది.

pavan kalyan fans hangama at theaters
పవన్ అభిమానుల సందడి
author img

By

Published : Apr 9, 2021, 12:19 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పవన్ అభిమానుల సందడి

విజయవాడ

వకీల్ సాబ్ సినిమా ఈ రోజు రిలీజ్ కావడంతో.. విజయవాడలో థియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్ బయట పవన్ కల్యాణ్ సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. కరోనా లాక్ డౌన్ తరువాత ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చింది ఈ సినిమాకే అని టికెట్ కౌంటర్ తెరచిన 30 నిమిషాల్లోనే టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయని తెలిపారు.

రాజోలు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో తాటిపాక, మలికిపురం, లక్కవరం సినిమా థియేటర్ల వద్ద పవన్ అభిమానులు సందడి చేశారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా అధిక సంఖ్యలో పవన్ అభిమానులు రావడంతో.. తాటిపాకలో 216 జాతీయ రహదారి, మల్కిపురం, లక్కవరం ప్రధాన రహదారి భారీగా ట్రాఫిక్ నిలిచింది. దీంతో పోలీసులు చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు.

గాజువాక

విశాఖజిల్లా గాజువాక శ్రీకన్య థియేటర్​లో అతిపెద్ద ప్లెక్సీని ప్రదర్శించారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా.. 106 అడుగుల పవన్ కల్యాణ్ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. కర్రి నేతాజీ, పల్లా మనోజ్, పల్లా కిషోర్, బోయి సంతోష్ ఈ ఫ్లెక్సీని చేయించారు. దీనిని అతిపెద్ద క్రేన్ సాయంతో పైకి పెట్టి..పాలాభిషేకం చేశారు.

ఇదీ చూడండి. ''వకీల్​సాబ్'.. నా కెరీర్​లో ఉత్తమ చిత్రం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.