చంద్రబాబు పేరు చెప్తే వదిలేస్తామంటూ మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ ఒత్తిడి తీసుకురావటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా ఖండించారు.
సీఐడీ ఇష్టానుసార ప్రవర్తన..
దర్యాప్తు అధికారులు ఇష్టానుసారంగా వాంగ్మూలాలు తయారు చేసి.. వాటిపై తెదేపా నేతల్ని సంతకాలు చేయాలని బెదిరించడం ఏం పద్ధతని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలనుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు.
కరోనా అల్లకల్లోలం సమయంలోనా..
కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో విచారణ పేరుతో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడం సీఎం జగన్ కక్షసాధింపు చర్యలో భాగమేనన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన వరుస దాడుల్ని నిరోధించటంలో విఫలమైన మంత్రి వెలంపల్లి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం విడ్డురమన్నారు. సొంత నియోజకవర్గంలోని దుర్గగుడి అవినీతి మంత్రికి తెలియకుండానే జరిగిందా అని చినరాజప్ప నిలదీశారు.
ఇవీ చూడండి : 4.5 లక్షల రెమ్డెసివిర్ వయల్స్ దిగుమతి !