దోషులను రక్షించే కుట్ర!
పోలీసులు కావాలనే దోషులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదిత్య తండ్రి ఆరోపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్మెన్కు తెలియకుండా హత్య జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు.
"ఎప్పుడో నా కొడుకు తిట్టాడని.. అది మనసులో పెట్టుకునే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ విషయం నమ్మశక్యంగా లేదు. అసలు విషయం హాస్టల్ వార్డెన్, వాచ్మెన్కు తెలుసు. అందుకే వారితో మాట్లాడటానికి మాకు అవకాశం కల్పించడం లేదు. హత్య చేసిన వ్యక్తులు వేరు... వారిని రక్షించేందుకే ఆ నెపాన్ని పదో తరగతి విద్యార్థిపై నెడుతున్నారు. సమగ్ర విచారణ జరపకుంటే... ఆందోళన చేస్తాం." - రవీంద్ర, ఆదిత్య తండ్రి
పోలీసులు ఏమంటున్నారంటే...
చల్లపల్లి బీసీ హాస్టల్లో ఆదిత్య మృతి చెందినప్పుడు రక్తపు మరకలు ఉన్న పదో తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించామని అవనిగడ్డ డిఎస్పీ ఎం. రమేష్ రెడ్డి తెలిపారు. ఆదిత్య తల్లిదండ్రుల వాదన వేరేవిధంగా ఉంది కనుక... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు.
ఆదిత్యను హత్యచేసింది తోటి విద్యార్థియేనా... లేక అందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా! పోలీసులు చెబుతున్నదే నిజమా... లేక తల్లిదండ్రుల ఆరోపణే సత్యమా... అసలు విషయం బయటికి రావాలంటే.. పోలీసులు మరింత నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిందే!?
సంబంధిత కథనం... సంఘర్షణల జీవనం... గతితప్పుతున్న బాల్యం!