కృష్ణా జిల్లా మోపిదేవి నుంచి పెదకళ్లేపల్లి వెళ్లే దారిలో కరెంటు తీగలపై తాటి చెట్టు కూలటం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అదే చెట్టు కింద ప్రతి రోజు కూలీలు కూర్చొని సేద తీరుతుంటారు. వేరు వ్యవస్థ బలహీనమవడంతో చెట్టు విరిగి తీగలపై పడిందని స్థానికులు అన్నారు... మంటలు రావటం అక్కడ ఉన్నవారు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. రోడ్డుకు అడ్డుగా చెట్టు పడిపోవటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి...