నందిగామలో జరిగిన ఈ నిరసనలో జీతాలు రాక అప్పులబాధ తట్టుకోలేక ప్రకాశం జిల్లా గిద్దలూరులో పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నందుకు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ప్రభుత్వం తమను చిన్నచూపు చుస్తోందంటూ వాపోయారు. పాలకులు నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్నామనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుని సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి '3 ఏళ్లలో 900 మంది విద్యార్థులకు అస్వస్థత'