కృష్ణాజిల్లా గన్నవరం సర్కిల్లో పని చేస్తున్న మహిళా పోలీస్ సిబ్బందికి ఓరియెంటేషన్ కోర్సులు ప్రారంభించారు. రాష్ట్ర అడిషనల్ డీజీపీ ట్రైనింగ్ వారి ఆదేశాల మేరకు ఏసీపీ తూర్పు విభాగం విజయ్ పాల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగం, వివిధ చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి ఇచ్చిన జాబ్ ఛార్ట్ పరిధిలో అధికారులకు ఏ విధంగా సహాయపడాలనే విషయాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు.
అలాగే దిశా మొబైల్ అప్లికేషన్‌కు సంబంధించి.. వినియోగం మహిళా భద్రతపై అవగాహన కల్పించనున్నారు. గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తులపై నిఘా, మిస్సింగ్ కేసులు, ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ విషయాలను తెలియజేస్తున్నారు.
మూడు రోజుల ఓరియంటేషన్ కోర్స్ అనంతరం అదనపు డీజీపీ ఉత్తర్వుల మేరకు వీరికి పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుందని గన్నవరం సీఐ కోమాకుల శివాజీ తెలిపారు. వాటి ఫలితాల ఆధారంగా ప్రొబేషన్ డిక్లేర్ చేయటం జరుగుతుందని చెప్పారు.
ఇదీ చదవండీ.. WOMEN RAILWAY STATION: ఆ రైల్వే స్టేషన్లో పనిచేసేవాళ్లంతా.. మగువలే