మార్చి నెలలో జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో.. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) పక్షాన అభ్యర్థినిగా మహిళకు అవకాశం ఇవ్వాలని తీర్మానించినట్లు అధ్యక్షుడు క్రిష్ణయ్య తెలిపారు. తమ అభ్యర్థిగా కల్పలతను ప్రకటించనున్నట్లు తెలిపారు.
విద్యావేత్త, ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి కల్పలత అని కృష్ణయ్య అన్నారు. జనవరి 8న జరగబోయే మిత్ర సంఘాల సమావేశంలో.. అన్ని సంఘాలు మద్దతు ప్రకటిస్తాయన్నారు. మహిళా ఉపాధ్యాయులు అత్యధికంగా ఉన్నారని.. వారి సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా కల్పలత ఉన్నారన్నారు. తమ సంఘం తరుపున తొలి మహిళా అభ్యర్థినిగా కల్పలత నిలుస్తారన్నారు. అందరు ఆమెను గెలిపించేందుకు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: