కృష్ణాజిల్లా నందిగామ సబ్‌డివిజన్ పరిధిలో అపరేషన్ ముస్కాన్‌లో భాగంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో 23 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. వీరికి నందిగామ డీఎస్పీ రమణమూర్తి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనులకు పంపించడం నేరమని తెలిపారు.
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి చదువు బాధ్యతను తామే చూస్తామని డీఎస్పీ వెల్లడించారు. తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ గ్రామీణ, జగ్గయ్యపేట సీఐలు సతీశ్, చంద్రశేఖర్ ఎస్సైలు రామకృష్ణ, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి