ETV Bharat / state

ఆటోనగర్​లో తెరుచుకున్న పరిశ్రమలు - latest vijayawada news

లాక్​డౌన్ సడలింపులతో విజయవాడ ఆటోనగర్​లో పరిశ్రమలు, వర్క్ షాపులు శుక్రవారం తెరుచుకున్నాయి. కార్మికులు, యజమానులు, వినియోగదారులు ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు నిర్వహిస్తున్నారు.

Opened Vijayawada Autonagar
ఆటో నగర్ లో తెరుచుకున్న పరిశ్రమలు
author img

By

Published : May 22, 2020, 8:58 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా రెండు నెలలుగా విజయవాడ జవహర్​ ఆటో నగర్​లో మూతబడిన పరిశ్రమలు వర్క్ షాపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఆటోనగర్ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ పారిశ్రామిక, కార్మిక సంఘాలు పలుమార్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఏపీఐఐసీ చైర్​పర్సన్ రోజాను కలిసి విజ్ఞప్తి చేయడంతో పరిశ్రమలు, వర్క్ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు.

కార్మికులు, యజమానులు, వినియోగదారులు ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చారు. ఎవరు వచ్చినా శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. చిన్న పరిశ్రమలలో సగం సిబ్బందితోనే పనులు ప్రారంభించారు.

ఇది చదవండి చాట్రాయి మండలంలో తెలంగాణ మద్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.