ETV Bharat / state

రూపాయి ఇళ్లు.. 8496 మందికే మాత్రమే!

కృష్ణా జిల్లాలో రూపాయికి టిడ్కో ఇళ్లు.. కొద్ది మందికి మాత్రమే దక్కనున్నాయి. 8496 మందికి మాత్రమే ఈ ఇళ్లు అందనున్నాయి. పునాదుల్లో ఉన్న నిర్మాణాలు నిలిపివేయనున్నారు. ఇళ్లను రద్దు చేసి..సెంటు స్థలం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంగల ఫ్లాట్లు... కేవలం రూపాయికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Only 8496 people will be given rupee houses
రూపాయి ఇళ్లు
author img

By

Published : Dec 3, 2020, 10:08 AM IST

కృష్ణా జిల్లాలో అతి కొద్దిమందికి మాత్రమే రూపాయికి టిడ్కో ఇల్లు దక్కనుంది. కేవలం 8496 మందికి మాత్రమే ఈ ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 27, 872 మందికే టిడ్కో (పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ) నిర్మించిన ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన వారికి సెంటు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే పునాదుల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం నిలిపివేయనున్నారు. దాదాపు 74 బ్లాక్‌లు ఈ విధంగా పునాదుల్లోనే ఆగిపోనున్నాయి.

గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో సెంటు స్థలం కేటాయించి ఇంటిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు టిడ్కో గృహాలు మొత్తం 91,138 మంజూరు కాగా గత ప్రభుత్వంలో 31,420 నిర్మాణం చేపట్టారు. వీటిలో ప్రస్తుతం 27,872 మాత్రమే పూర్తి చేయనున్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంగల ఫ్లాట్లు కేవలం రూపాయికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జక్కంపూడిలోనూ పునాదుల దశలో ఉన్న బ్లాకులకు మోక్షం లేనట్లే.

ఇదీ చూడండి:

సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు 14 రోజుల రిమాండ్.. కర్నూలు జైలుకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.