కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆన్లైన్ పూజా సేవలు అందుబాటులోకి తెచ్చారు. స్వామి వారికి ప్రత్యక్షముగా నిర్వహించు సేవలు, పూజలు నిలిపివేసి భక్తులకు ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు భక్తులు భక్తులు ఆన్ లైన్ ద్వారా సొమ్మును చెల్లించి.. పేరు, గోత్ర నామాలతో జరిపించుకోవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి జీవిడియన్ లీలాకుమార్ తెలిపారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విరాళములు, కానుకలు https://tms.ap.gov.in వెబ్ సైట్లో లాగిన్ అయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం, మోపిదేవిని ఎంచుకొని ఈ-హుండీ ద్వారా చెల్లించి రసీదు ప్రింట్ తీసుకోవచ్చునని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లీలాకుమార్ సూచించారు.
ఇదీ చదవండీ.. 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'