ETV Bharat / state

ఘనంగా ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు - గుడివాడ ఎడ్ల పోటీలు 2021

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన అలరించింది. పోటీలకు ఇతరరాష్ట్రాల నుంచి కూడా వృషభాలను తీసుకొచ్చారు. గెలుపొందిన ఒంగోలు జాతి ఎడ్ల పోషకులకు పారితోషకాలతో సత్కరించారు. పశుపోషణ పట్ల అభిలాషను పెంచేందుకు ఇలాంటి పోటీలు ఉపకరిస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ongol ox races
ఘనంగా ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు
author img

By

Published : Jan 15, 2021, 1:35 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఘనంగా ముగిశాయి. ఎన్టీఆర్​ టు వైఎస్​ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వృషభాలు పాల్గొన్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

ఏటా సంక్రాంతి సందర్భంగా 12, 13,14 తేదీల్లో పోటీలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. పోటీల్లో పాల్గొన్న పశుపోషకులకు ట్రస్ట్ సభ్యులు పారితోషకాలతో సత్కరించారు. పశుపోషణపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పశుపోషకులన్నారు. దేశం నుంచి ఇతర దేశాలకు తరలిన ఒంగోలు జాతి.. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాయనీ.. ఇక్కడ కూడా ఒంగోలు జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి: కోడి పందాల బరిలో ఘర్షణ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.