మహిళను రక్షింప బోయి బుడమేరు కాల్వలో గల్లంతైన యువకుడు.. శవమై తేలాడు. సోమవారం రాత్రి విజయవాడ మధురానగర్ బుడమేరు కాలవలో స్థానికంగా నివసించే ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన ముగ్గురు యువకులు కాల్వలో దూకి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు యువకుల్లో ఒకరు బుడమేరులో గల్లంతు అవ్వగా అతని మృతదేహాన్ని విపత్తు నిర్వహక బృందం బయటకు తీసింది. మృతుడిని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీకి చెందిన శివరామకృష్ణ గా గుర్తించారు. మాచవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి