కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిలకలపూడి గ్రామంలో దారుణం జరిగింది. సరిహద్దు వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొణతం రామయ్య, కుమారుడు సాంబశివరావు మరో ఐదుగురుతో కలిసి పంది వీరప్రసాద్ (ప్రభాకర్ రావు)పై దాడి చేశారు.
బలమైన ఆయుధాలతో దాడి చేయడంతో వీరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వీరప్రసాద్ కుమారుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘంటసాల ఎస్సై లక్ష్మీ నరసింహమూర్తి, చల్లపల్లి సి.ఐ. శ్రీనివాసరావు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: