విజయవాడ నగరంలో ఆయుర్వేద డాక్టరు ఇంట్లో చోరీ కేసులో మరో నిందితుడు ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకోగా... తాజా అరెస్ట్‌తో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రకాశ్ నుంచి ఏడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఇంత త్వరగా మమ్మల్ని వీడి వెళతాడనుకోలేదు'