కృష్ణా జిల్లా మండవల్లి మండలం భైరవపట్నంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని మూడేళ్ల పాపపై తాత వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గ్రామంలోని చేపలచెరువు వద్ద కాగిత గంగాప్రసాద్ నివాసముంటున్నాడు. ఆయనకు దాదాపు 60 సంవత్సరాలు. ఆయన పాపని తనవద్ద నిద్రపుచ్చుతానని తీసుకెళ్లి.. ఈ దారుణానికి ఒడిగట్టాడని పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వైద్యపరీక్షల నిమిత్తం పాపను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి..