పాలిహౌస్, షెడ్ నెట్లలో పండించే కూరగాయల రక్షిత సాగు పద్ధతులపై ఒడిశా నుంచి వచ్చిన ఉద్యానశాఖ అధికారులు కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో కూరగాయల సాగును పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న కీరదోస పంటల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు యక్కటి హనుమాన్ ప్రసాద్ షెడ్నెట్లో రెండు ఎకరాల్లో రెండు సంవత్సరాలుగా కీర దోస, నారుమడులు పెంపకం ఇతర సాగు విధానాలను అధికారులు వారికి వివరించారు.
కృష్ణాజిల్లా, ఉద్యాన శాఖ అధికారి డి. దయాకర బాబు ఒడిశా బృందానికి సాగు పద్ధతులు గూర్చి తెలియజేశారు. ఒడిశా బృందం అధికారుల వెంట అవనిగడ్డ ఉద్యానశాఖ అధికారి జి. లకపతి, రైతు భరోసా కార్యాలయ సిబ్బంది, రైతులు ఉన్నారు.
ఇదీ చదవండి: